ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర
||ప్రాణేశ్వర||
నా ఆత్మతో పాటలు పాడ - నీ కృపలే నాకు హేతువులాయె (2)
నిత్య నిబంధన నీతో చేసి - నీ పాద సన్నిధి చేరియున్నానే (2)
||ప్రాణేశ్వర||
మూలరాయి నీవైయుండగా - అపొస్తలుల పునాది మీద (2)
నిత్య నివాసముగా కట్టబడుటకై - ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2)
||ప్రాణేశ్వర||
పిడుగులు విసిరే మెరుపుల వంటి - శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2)
నాకు విరోధముగా రూపించిన ఏ - ఆయుధము వర్ధిల్లలేదు (2)
||ప్రాణేశ్వర||
నా ఊటలన్నియు నీ యందేనని - వాద్యము వాయించి పాడెదను (2)
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి - సాగెద నూతన యెరూషలేము (2)
||ప్రాణేశ్వర||
కమనీయమైన నీ దర్శనము - కలనైనను మెలకువనైన (2)
కనబడినా నా ఆశలు తీరవే - కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2)
||ప్రాణేశ్వర||
