Worship
పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు
Parishuddhudu Parishuddhudu Raajula Raaju Yesu
పరిశుద్ధుడు పరిశుద్ధుడు - రాజుల రాజు యేసు
బలవంతుడు బలమిచ్చును - ప్రభువుల ప్రభువు క్రీస్తు (2)
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ
అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2)
ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా
ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా
||పరిశుద్ధుడు||
నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును
కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2)
ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను - జయశాలి నీవుండగా
||పరిశుద్ధుడు||
