Devotional
పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై
Parugethedaa Pilupuku Thagina Bahumatikai
పరుగెత్తెదా పరుగెత్తెదా
పిలుపుకు తగిన బహుమతికై
ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో
గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2)
||పరుగెత్తెదా||
దైవ భయము కలిగి - శరీరేఛ్చలను విడిచి (2)
అక్షయ కిరీటము కొరకే - ఆశతో పరుగెత్తెదా (2)
||పరుగెత్తెదా||
ఆత్మాభిషేకము కలిగి - ఆత్మల భారముతో (2)
అతిశయ కిరీటము కొరకే - అలయక పరుగెత్తెదా (2)
||పరుగెత్తెదా||
యేసు వైపు చూచుచు - విశ్వాసము కాపాడుకొనుచు (2)
వాడబారని కిరీటముకే - వాంఛతో పరుగెత్తెదా (2)
||పరుగెత్తెదా||
