Prayer

పంపుము దేవా దీవెనలతో

Pampumu Devaa Deevenalatho

Watch on YouTube
పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా (2) పంపుము దయ చేత పతిత పావన నామ పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము|| మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2) యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము|| వినిన సత్యంబును - విమలాత్మ మది నిల్పి (2) దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము|| ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2) భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము||