Worship

పదే పాడనా నిన్నే కోరనా

Padhe Paadaanaa Ninne Koranaa

Watch on YouTube
పదే పాడనా నిన్నే కోరనా - ఇదే రీతిగా నిన్నే చేరనా (2) నీ వాక్యమే నాకుండగా - నా తోడుగా నీవుండగా ఇదే బాటలో నే సాగనా - ఇదే రీతిగా నా యేసయ్య ||పదే పాడనా|| ప్రేమను పంచే నీ గుణం - జీవము నింపే సాంత్వనం మెదిలెను నాలో నీ స్వరం - చూపెను నాకు ఆశ్రయం నీవే నాకు ప్రభాతము - నాలో పొంగే ప్రవాహము నీవే నాకు అంబరం - నాలో నిండే సంబరం నాలోన మిగిలే నీ ఋణం - నీతోటి సాగే ప్రయాణం ||పదే పాడనా|| మహిమకు నీవే రూపము - మధురము నీదు నామము ఇదిగో నాదు జీవితం - ఇలలో నీకే అంకితం నీవే నాకు సహాయము - నిన్న నేడు నిరంతరం నీవే నాకు ఆశయం - నాలో నీకే ఆలయం ధరలోన లేరు నీ సమం - నీ ప్రేమధారే నా వరం ||పదే పాడనా||