Encouragement

ఒంటరివి కావు ఏనాడు నీవు

Ontarivi Kaavu Aenaadu Neevu

Watch on YouTube
ఒంటరివి కావు ఏనాడు నీవు నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2) ఆలకించవా ఆలోచించావా ఆనందించవా (2) ||ఒంటరివి|| వెలివేసారని చింతపడకుమా ఎవరూ లేరని కృంగిపోకుమా ఒంటరితనమున మదనపడకుమా మంచి దేవుడు తోడుండగా (2) ఆత్మహత్యలు వలదు ఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా|| బలము లేదని భంగపడకుమా బలహీనుడనని బాధపడకుమా ఓటమి చూచి వ్యసనపడకుమా బలమైన దేవుడు తోడుండగా (2) నిరాశ నిస్పృహ వద్దు సాగిపోవుటే ముద్దు (2) ||ఆలకించవా||