Praise

ఓ నాదు యేసు రాజా నిన్ను నే నుతించెదను

O Naadu Yesu Raajaa Ninnu Ne Nutinchedanu

Watch on YouTube
ఓ నాదు యేసు రాజా నిన్ను నే నుతించెదను (2) నీ నామమును సదా నే సన్నుతించుచుండును (2) ||ఓ నాదు|| అనుదినము నిను స్తుతియించెదను (2) ఘనంబు చేయుచుండును నేను (2) ||ఓ నాదు|| వర్ణించెద నే నీ క్రియలను (2) స్మరియించెద నీ మంచితనంబున్ (2) ||ఓ నాదు|| రక్షణ గీతము నే పాడెదను (2) నిశ్చయ జయధ్వని నే చేసెదను (2) ||ఓ నాదు|| విజయ గీతము వినిపించెదను (2) భజియించెద జీవితమంతయును (2) ||ఓ నాదు|| నిరీక్షణ పూర్ణత కలిగి (2) పరికించెద నా ప్రభు రాకడను (2) ||ఓ నాదు||