Prayer
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
O Devaa Daya Choopumayyaa Desaanni Baaguchayumayyaa
ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొరను అలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు ఉజ్జీవం రగిలించు
||ఓ దేవా||
సర్వలోక రక్షకా కరుణించుమయ్యా
నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా
అంధకార ప్రజలను వెలిగించుమయ్యా
పునరుత్ధాన శక్తితో విడిపించుమయ్యా
ఒకసారి చూడు ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు
దేశాన్ని క్షమియించు ప్రేమతో రక్షించు
||ఓ దేవా||
