Worship

ఓ క్రీస్తు సంఘమా పరిశుద్ధ సంఘమా

O Kreestu Sanghamaa Parishuddha Sanghamaa

Watch on YouTube
ఓ క్రీస్తు సంఘమా పరిశుద్ధ సంఘమా ప్రభువు నామములో సాగే అనుబంధమా ఓ ప్రియ సంఘమా యేసయ్య దేహమా ఓ కంట కన్నీరు తగదు సహవాసమా ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు|| మనమంతా కలిసి ఆ దేవుని దేహము తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2) ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము|| సాటి సోదరులు శ్రమల పాలైనపుడు సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2) ధైర్యమును నింపాలి విశ్వాసము పెంచాలి ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) ||ప్రతి కష్టము|| శ్రమలు పొందేవారు అవిధేయులు కారు విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2) శాంతమును పాటించి దేవునిలో వీక్షించి పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) ||ప్రతి కష్టము||