Prayer

నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని

Nishiraathri Sudigaalilo Chikkithini

Watch on YouTube
నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని ఊపిరితో మిగిలెదనా ఉదయానికి తడవు చేయక యేసు నను చేరుకో నా ప్రక్కనే ఉండి నను పట్టుకో భయముండగలదా నీవున్నచో నీ కన్నులు నామీద నిలిచుండగా నా చేయి నీ చేతిలో ఉండగా ||నిశిరాత్రి|| ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం కనిపించక దారులు మొదలాయెను కలవరము వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు ||నిశిరాత్రి|| నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి ఉదయమును చూపించుము నా కంటికి అల్పము ఈ జీవితమని నేనెరిగితిని కనురెప్పపాటున ఆవిరికాగలదు అనుదినమిక నీ కృపనే నే కోరుచు పయనింతును నా గురివైపు నిను ఆనుకుని భయముండగలదా నీవున్నచో నీ కన్నులు నామీద నిలిచుండగా నా చేయి నీ చేతిలో ఉండగా