Good Friday

నిర్దోషమైనది - నిష్కలంకమైనది

Nirdhoshamainadhi Nishkalankamainadhi

Watch on YouTube
నిర్దోషమైనది - నిష్కలంకమైనది నిర్దోషమైనది - నిష్కలంకమైనది మనుషులలో - ఆ దూతలలో లేనేలేనిది మనుషులదో - ఆ దూతలదో కానేకాదది యేసు రక్తము - పరిశుద్ధ రక్తము యేసు రక్తము - అది దైవ రక్తము (2) యేసు రక్తము - అది దైవ రక్తము (2) ||నిర్దోషమైనది|| ఏ నరుని రక్తమైనా - పాపములను కడుగ గలదా? ఏ నరుని రక్తమైనా - శాపములను బాపగలదా? (2) పాపాలని కడిగి - శాపాలని బాపి (2) పరిశుద్ధ పరుచును - నా యేసు రక్తము (2) ||యేసు రక్తము|| ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరిచేనా? ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా? (2) రోగాలపై జయము - దయ్యాలకే భయము (2) కలిగించు రక్తము - నా యేసు రక్తము (2) ||యేసు రక్తము|| ఏ నరుని రక్తమైనా - మనసాక్షిని శుద్ధి చేసేనా? ఏ నరుని రక్తమైనా - మన బుద్ధిని మార్చగలిగేనా? (2) మనస్సాక్షికే శుద్ధి - మన బ్రతుకులో బుద్ధి (2) కలిగించు రక్తము - నా యేసు రక్తము (2) ||యేసు రక్తము||