నీవే ఆశ్రయదుర్గం - నీవే నా సహాయం
నీవే కేడెము బలము - యేసూ నీవే నా దాగు స్థలము
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా (2)
నీవే ఆదియు అంతం - నీవే మారని దైవం
నీవే జీవాహారం - యేసూ నీవే జీవనాధారం
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా (2)
నీవే రక్షణశృంగం - నీవే పునరుత్థానం (2)
పునరుత్థానుడా యేసయ్యా
నాకొరకు బలియైన రక్షకుడా (2)
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా (2)
నీవంటి వారే లేరు యేసయ్యా
నీవు లేని చోటే లేదు యేసయ్యా (2)
నీవే హృదయధ్యానం
యేసూ నీవే నా స్తోత్రగానం
