Devotional

నీవే నన్ను కోరుకున్నావు

Neeve Nannu Korukunnaavu

Watch on YouTube
నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2) ||నీవే|| నీ అరచేతిలో నను చెక్కుకున్నావు నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు నీ రాజ్యములో నను దాచి ఉంచావు నీ నామములో నను రక్షించావు ||ఎంత|| నీ వాక్యముతో నను శుద్ధి చేసావు నీ రక్తముతో నను కడిగివేసావు నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత||