Devotional

నీ ప్రేమకు సాటి లేదయా

Nee Premaku Saati Ledayaa

Watch on YouTube
నీ ప్రేమకు సాటి లేదయా యేసయ్యా… నీ సన్నిధి నాకు మేలయ్యా (2) నా కొరకై ప్రాణమిచ్చితివి నా కొరకై సిలువనెక్కితివి (2) కరుణించి కాపాడుమా నా యేసయ్యా కన్నీటి ప్రార్ధన ఆలకించుమా (2) ||నీ ప్రేమకు|| అవిశ్వాసురాలై నేనుండగా అంధకారమందు రక్షించితివే నా దీనస్థితిలో నా దరికి చేరి నీ వాక్యముతో బలపరచితివే (2) మనోహరమైన నీ కృపనిచ్చి నన్నాదరించితివే (2) నా బ్రతుకు దినములన్ని నిను వేడెదన్ నా యేసయ్యా (2) నా యేసయ్యా…. ||నీ ప్రేమకు|| ఏమివ్వగలను నీ ప్రేమకు నా సర్వము నీవేనయా నా అతిశయము ఆధారము నాకన్నియు నీవేనయా (2) విశ్వాసముతో నీటిపైన నన్ను నడువనిమ్ము (2) నా అడుగులు తడబడగా నన్నెత్తుకో నా యేసయ్యా (2) నా యేసయ్యా…. ||నీ ప్రేమకు||