నీ ప్రేమకు సాటి లేనే లేదు
ప్రేమారూపా యేసురాజా (2)
నింగియందునా - నేల యందునా
పాతాళమందునా - ఎందైన గాని (2)
నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు
||నీ ప్రేమకు||
పాపినైన నా కొరకు - పరలోకం విడచినదెవరు
నా పాపముల కొరకై - సిలువలో మరణించినదెవరు (2)
క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే
||నీ ప్రేమకు||
ధరలోని ధన ధాన్యములు - నన్ను వీడినా
ఇలలో నా సరివారు - త్రోసివేసినా (2)
ఇహమందు పరమందు నా ధనము నీవే
||నీ ప్రేమకు||
