నీ జీవితం క్షణ భంగురం
గమ్యంబులేని వేదనల వలయం (2)
నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2)
దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం
||నీ జీవితం||
ఏది సత్యం ఏది నిత్యం - ఏది మాన్యం ఏది శూన్యం
సరి చూసుకో ఇప్పుడే - సరి చేసుకో (2)
ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో
గమనించుమా ప్రియ నేస్తమా (2)
||నీ జీవితం||
కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా
నీ సర్వ భారమంతా - యేసు పైన వేయుమా (2)
నీ హృదయ భారం తీరును ఈ క్షణం
దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2)
||నీ జీవితం||
