నేడు యేసు లేచినాడు
నేడు యేసు లేచినాడు
మనమానందము నొందుదాము (2)
||నేడు||
పరలోకము నుండి దూతలు
దిగి వచ్చిరి సమాధికి (2)
భద్రముగా చేసిరిగా
బహు భద్రముగా చేసిరిగా
||నేడు||
మగ్దలేనే మరియ వేరొక మరియ
సుగంధ తైలము తెచ్చుకొని (2)
పూయుటకు వెళ్లిరిగా
బహు పూయుటకు వెళ్లిరిగా
||నేడు||
వేకువ జామున యేసు ప్రభుండు
తోటలో సంచరింపంగ (2)
తోటమాలి అనుకొనెను
బహు తోటమాలి అనుకొనెను
||నేడు||
నేను ఇంకను తండ్రి యొద్దకు
త్వరగా వెళ్లిపోలేదు (2)
కనుక నన్ను ముట్టవద్దు
మరియమ్మ నన్ను ముట్టవద్దు
||నేడు||
