Christmas

నేడే ప్రియరాగం పలికే నవ గీతం

Nede Priyaraagam Palike Nava Geetham

Watch on YouTube
నేడే ప్రియరాగం పలికే నవ గీతం ప్రేమే మన కోసం వెలసే లోకాన శాంతి మురిసింది మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే|| దివినేలు దేవుడు ఉదయించగానే ఇలలోన ప్రకృతి పులకించెగా పరలోక దూతలు స్తుతియించగానే జగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే|| మనిషైన సుతుడు జనియించగానే విశ్వాన గోళాలు విభవించెగా చిన్నారి యేసుని చిరునవ్వుతోనే నవ కాంతి లోకాన ప్రభవించెగా ||నేడే|| హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్ టు యు… లోకాన శాంతి మురిసింది మన మనస్సులో రాగాల కాంతి విరిసింది