Worship

నను చేరిన నీ ప్రేమ

Nanu Cherina Nee Prema

Watch on YouTube
నను చేరిన నీ ప్రేమ తొలగించని నీ ప్రేమ జీవితానికి చాలిన - యేసు నీ ప్రేమ నిను నేను విసిగించినా నిను విడచి పారిపోయినా నిను నేను హింసించినా - వీడని ప్రేమ నన్ను ఓర్చి దరికి చేర్చి స్నేహించి నను ప్రేమించి జీవమునిచ్చి నను దీవించి నీ పాత్రగ మలిచావు (2) ||నను చేరిన|| నీ ప్రేమ నన్ను మార్చింది నీ రక్తం నన్ను కడిగింది నీ వాక్యం నన్ను నిలిపింది నీ మరణం జీవమునిచ్చింది (2) ||నన్ను ఓర్చి|| నీ మాట నాకు ధైర్యంగా నీ స్పర్శ నాకు నెమ్మదిగా నీ ప్రేమ నాకు ఊపిరిగా నీ స్వరము నాకు శాంతిగా (2) ||నన్ను ఓర్చి||