Prayer

నన్ను గన్నయ్య రావె నా యేసు

Nannu Gannayya Raave Naa Yesu

Watch on YouTube
నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను (2) పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి (2) మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను (2) ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను (2) కారణ గురువు లింకెవ్వరు లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని (2) దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||