నాదు జీవితము మారిపొయినది
నిన్నాశ్రయించిన వేళ
నన్నాదుకుంటివి ప్రభువా
||నాదు||
చాలునయ్యా దేవా - ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2)
పాప కూపము విడిచి - నీ దారి నడచితి దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..
||నాదు||
కన్ను గానని దిశగా - బహు దూరమేగితినయ్యా (2)
నీ ప్రేమ వాక్యము వినగా - నా కళ్ళు కరిగెను దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..
||నాదు||
లోకమంతా విషమై - నరకాగ్ని జ్వాలలు రేగే (2)
ఆ దారి నడపక నన్ను - కాపాడినావని దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..
||నాదు||
జాలిగల నా ప్రభువా - నీ చేయి చాపవా ప్రభువా (2)
చేరగల నీ దరికి - నే పాపినయ్యా ప్రభువా
నే పాపినయ్యా ప్రభువా..
||నాదు||
ఆరిపోని జ్యోతివై - కన్నులలోని కాంతివై (2)
ఎంత కాలముంటివి - ఎంతగా ప్రేమించితివి
నన్నెంతగా ప్రేమించితివి..
||నాదు||
