నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వమేసుకే నాదు జీవము
నాదు దైవము - దివి దివ్య తేజము (2)
||నాదు||
కృంగిన వేళ - భంగపడిన వేళ - నా దరికి చేరెను
చుక్కాని లేని - నావ వలె నేనుండ - అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను - ఆలోచన చెప్పెను (2)
||నాదు||
సాతాను బంధీనై - కుములుచున్న వేళ - విడిపించెను శ్రీ యేసుడు
రక్తమంత కార్చి - ప్రాణాన్ని బలిచేసి - విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్కన్ - అధికారం బలమిచ్చెను (2)
||నాదు||
కారు మేఘాలెన్నో - క్రమ్మిన వేళ - నీతిసుర్యుడు నడుపును
తూఫానులెన్నో - చెలరేగి లేచిననూ - నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగివచ్చును - తరలి పోదును ప్రభునితో (2)
||నాదు||
