నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే - నీవే (2)
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా
||నా తండ్రి||
నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి (2)
పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ (2)
||యేసయ్యా||
గాడాంధకార లోయలో
నే నడచిన ప్రతివేళలో
తోడున్న నా తండ్రివి (2)
వేయిమంది కుడి ఎడమకు
కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ (2)
||యేసయ్యా||
