Devotional

నా తనువు నా మనసు

Naa Thanuvu Naa Manasu

Watch on YouTube
నా తనువు నా మనసు నా నైపుణ్యం నీ కొరకే నా తలంపులు నా మాటలు నా క్రియలు నీ కొరకే నా ప్రయాసే కాదు నీ కరుణతో నిలిచింది ఈ జీవితం నీ నామం కీర్తించాలని నీ బలం చూపించాలని అందుకేగా నన్నిలలో నియమించితివి నీ స్వరూపముగా నీ శ్వాసతో నను సృజియించితివి నీ మహిమగా నేనుండుటకు నీతోనే జీవించుటకు (2) అందుకేగా నన్నిలలో సృజియించితివి అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు|| గర్భ వాసమున లేనప్పుడే నన్ను ప్రతిష్టించితివి నీ వెలుగునే ప్రకాశించుటకు నీ ప్రేమనే పంచుటకు (2) అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||