Encouragement

నా తల్లి నను మరచినా

Naa Thalli Nanu Marachinaa

Watch on YouTube
నా తల్లి నను మరచినా నా వారే నను విడచినా (2) విడువని దేవుడవయ్యా ఎడబాయని వాడవయ్యా (2) యేసయ్యా హల్లెలూయా (4) ||నా తల్లి|| స్నేహితులే నన్ను బాధించినా బంధువులే నన్ను వెలివేసినా (2) అన్నదమ్ములే నన్ను నిందించినా నే నమ్మినవారే గాయపరచినా (2) ||విడువని|| లోకమంతా నన్ను ఏడ్పించినా శత్రువులే నన్ను వేధించినా (2) సాతానే నన్ను శోధించినా సమాజమే నన్ను త్రోసేసినా (2) ||విడువని||