నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచిపోవునా (2)
ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)
స్తుతింపజేయునే - నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)
నిట్టూర్పు శబ్దము విన్న - నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో - ఇది మొదలు వినబడునే (2)
తరిగిపోను నేను - అణగార్చబడను నేను (2)
||స్తుతింపజేయునే||
సరిచేయు వాడే - ఓ ….స్థిరపరచినాడే
బలపరచినాడే - పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను - హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో - అలంకరించునే…
||స్తుతింపజేయునే||
విచారించే వారు లేక - ఒంటరైయున్న నీకు
ఆరోగ్యము దయచేసి - పరిపాలన నిచ్చునే (2)
కూలిన కోటను - రాజగృహముగా మార్చును (2)
||స్తుతింపజేయునే||
||నా మనస్సా||
