Prayer

నా మనో నేత్రము తెరచి

Naa Mano Nethramu Therachi

Watch on YouTube
నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి (2) అంధకారములో నేనుండ (2) వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో|| నే పాప భారము తోడ చింతించి వగయుచునుంటి (2) కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో|| ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా (2) బాధలు శోధనలు శ్రమలలో (2) ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో|| నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి (2) స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2) యుగయుగములు సర్వ యుగములు (2) ||నా మనో||