Faith

నా జీవిత యాత్రలో

Naa Jeevitha Yaathralo

Watch on YouTube
నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు (2) ||నా జీవిత|| పలు విధ శోధన కష్టములు ఆవరించియుండగా (2) కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము (2) ||నా జీవిత|| నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు (2) నీదు కుడి హస్తములో నిత్యమున నాకు సుఖ క్షేమముగా (2) ||నా జీవిత|| ఈ లోక నటన ఆశలన్నియు తరిగిపోవుచుండగా (2) మారని వాగ్ధానములన్నియు నే నమ్మి సాగెదను (2) ||నా జీవిత|| ముందున్న సంతోషము తలంచి నిందలను సహించి (2) నీ సిలువను నే మోయుటకై నీ కృప నాకీయుము (2) ||నా జీవిత|| సీయోను యొక్క ఆలోచనతో సదా నడిపించుము (2) మహిమలో నీతోనే నిల్చుటకు నా తండ్రి దయచూపుము (2) ||నా జీవిత||