Encouragement

నా జీవిత వ్యధలందు యేసే జవాబు

Naa Jeevitha Vyadhalandhu Yese Javaabu

Watch on YouTube
నా జీవిత వ్యధలందు యేసే జవాబు యేసే జవాబు - ప్రభు యేసే జవాబు (2) ||నా జీవిత|| తీరని మమతలతో ఆరని మంటలలో ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2) నను గని వచ్చెను - తన కృప నిచ్చెను కరుణతో ప్రేమించి - కలుషము బాపెను ||నా జీవిత|| చీకటి వీధులలో నీటుగా నడచితిని లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2) నను గని వచ్చెను - తన కృప నిచ్చెను కరుణతో ప్రేమించి - కలుషము బాపెను ||నా జీవిత|| హంగుల వేషముతో రంగుల వలయములో నింగికి నేనెగిరి నేలను రాలితిని (2) నను గని వచ్చెను - తన కృప నిచ్చెను కరుణతో ప్రేమించి - కలుషము బాపెను ||నా జీవిత||