నా ఆశల పల్లకి నీవే
నా ఊహల ఊట నీవే
నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా ఆశ నీవయ్యా (2)
ఎడారిలో నీటి కొరకు - ఆశపడు బాటసారిలా
నీ కొరకు నా ప్రాణం - ఆశపడుచున్నది (2)
నా ఆశ నీవైపే - నా ధ్యాస నీవైపే
దాహము తీర్చావని (2)
దాహము తీర్చావని
||యేసయ్యా||
దిక్కులేని పక్షిగా నేను - నిరాశతో ఉండగా
నా ఆశ తీర్చావే - నీ దరి చేర్చావే (2)
నా గమ్యం నీవైపే - నా గానం నీ కొరకే
తోడుగ ఉన్నావని (2)
తోడుగ ఉన్నావని
||యేసయ్యా||
స్నేహితులు లేరని - తోడెవరు రారని
నా మనసు నాలోన - దుఃఖించు సమయాన (2)
నా స్నేహం నీవయ్యావు - దుఃఖము తీర్చావు
ఆదరించావయ్యా (2)
ఆదరించావయ్యా
||యేసయ్యా||
