నశియించెడి లోకంలో - వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి - సాగించు నీ పయనం - (2)
అది నాదంటూ ఇది నాదంటూ - ఆనందం కోల్పోతూ
పరమార్ధం గ్రహియించకనే - గతియించిపోతావా
||నశియించెడి||
కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)
క్రీస్తు దారిలో సాగి - నిత్య రాజ్యమే చేరి (2)
వసియించు కలకాలం - సత్యమైన లోకంలో
||నశియించెడి||
నిలచిపోవును మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2)
ఇకనైనా తేరుకొని - గ్రహియించు సత్యాన్ని (2)
యేసులోకి మళ్ళించు - నీ జీవిత గమనాన్ని
||నశియించెడి||
