Worship

మందిరములోనికి రారండి

Mandiramuloniki Raarandi

Watch on YouTube
మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి (2) కలవరమైనా కలతలు ఉన్నా (2) తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను ||మందిరము|| దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది (2) వెంటాడే భయములైనా వీడని అపజయములైనా (2) ||తొలగిపోవును|| సత్యము భోదించు దేవుని బడి ఇది ప్రేమను చాటించు మమతల గుడి ఇది (2) శ్రమల వలన చింతలైనా శత్రువుతో చిక్కులైనా (2) ||తొలగిపోవును|| శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి (2) కుదుటపడని రోగమైనా ఎదను తొలిచే వేదనైనా (2) ||తొలగిపోవును||