Wedding

మధురం ఈ శుభ సమయం

Madhuram Ee Shubha Samayam

Watch on YouTube
మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం (2) ఆనందమే ఇరువురి హృదయం (2) జత కలిసె ఈ తరుణంలో (2) నవ దంపతులకు స్వాగతం ||మధురం|| ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2) మీ జీవిత సంద్రాన - ఎన్ని కష్టాలు ఎదురైనా (2) ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం|| ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము మనసులో వెలియగ మమతలు విరబూయగా (2) అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2) మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి ||మధురం||