Worship

మధురం మధురం - నీ ప్రేమే అతి మధురం

Madhuram Madhuram - Nee Preme Athi Madhuram

Watch on YouTube
మధురం మధురం - నీ ప్రేమే అతి మధురం అమరం అతి విజయం - నీ సిలువ రక్తమే విజయం ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం - నీకే నా వందనం (2) మధురం మధురం - నీ ప్రేమే అతి మధురం (2) ||మధురం|| నా శిక్షకై నా నిందలకై - ప్రాణము పెట్టిన ప్రేమ నిందలు నిట్టూర్పులు - సేదదీర్చిన ప్రేమ (2) సర్వోన్నతుడా సహాయకుడా మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం|| సత్యమును నాకు కేడెమును - ధరియింప చేసిన ప్రేమ కనికరమును కలిగించగను - కల్వరికేగిన ప్రేమ (2) మహోన్నతుడా మహా ఘనుడా మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం||