Praise

మహిమ నీకే ఘనత నీకే - నీతి సూర్యుడా

Mahima Neeke Ghanatha Neeke - Neethi Sooryudaa

Watch on YouTube
మహిమ నీకే ఘనత నీకే - నీతి సూర్యుడా (2) న్యాయాధిపతియైన నా యేసయ్యా - నీకే ఆరాధన (2) ధనవంతులను అణచేవాడవు జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2) దరిద్రులను లేవనెత్తువాడవు - నీవే రాజువు (2) యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా (2) మార్గమే తెలియని అబ్రహామును - అనేకులకు తండ్రిగా చేసినావు నెట్టివేయబడిన యోసేపుచే - అనేకులను కాపాడినావు ||దరిద్రులను|| గొఱ్ఱెలకాపరియైన దావీదును - అనేకులకు రాజుగా చేసినావు నోటి మాంద్యముగల మోషేచే - అనేకులను నడిపించినావు ||దరిద్రులను||