మధురం మధురం - నీ ప్రేమే అతి మధురం
అమరం అతి విజయం - నీ సిలువ రక్తమే విజయం
ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం - నీకే నా వందనం (2)
మధురం మధురం - నీ ప్రేమే అతి మధురం (2)
||మధురం||
నా శిక్షకై నా నిందలకై - ప్రాణము పెట్టిన ప్రేమ
నిందలు నిట్టూర్పులు - సేదదీర్చిన ప్రేమ (2)
సర్వోన్నతుడా సహాయకుడా
మరువగలనా నీ ప్రేమను (2)
||మధురం||
సత్యమును నాకు కేడెమును - ధరియింప చేసిన ప్రేమ
కనికరమును కలిగించగను - కల్వరికేగిన ప్రేమ (2)
మహోన్నతుడా మహా ఘనుడా
మరువగలనా నీ ప్రేమను (2)
||మధురం||
