Evangelism

మార్గము సత్యము జీవము సర్వము నీవే

Maargamu Sathyamu Jeevamu Sarvamu Neeve

Watch on YouTube
మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్యా (2) నీవేనయ్యా యేసు నీవేనయ్యా నీవేనయ్యా నా కరుణామయా (2) పాపపు ముసుగుల వలయములో సంబరపడి కొనసాగితిని పాపపు శాపపు తావులలో దారినిగానక కూలితిని (2) ప్రేమామయా నను చేరితివి నీ వెలుగు దారిని చూపితివి (2) ఏనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి ||మార్గము|| జ్ఞానిని నేనని అనుకొంటిని ఏ కీడు రాదనుకొంటిని సాతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారిగానక ఏడ్చితిని (2) ప్రేమామయా నను చేరితివి నీ వెలుగు దారిని చూపితివి (2) ఏనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి ||మార్గము|| దుష్టుల గుంపున నేనుంటిని దుర్దినమే రాదనుకొంటిని మరణపు గవినిని తాకితిని నీ ప్రేమ పిలుపే నే వింటిని (2) ప్రేమామయా నను చేరితివి నీ వెలుగు దారిని చూపితివి (2) ఏనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి ||మార్గము||