Faith

మార్గము నీవని గమ్యము నీవని

Maargamu Neevani Gamyamu Neevani

Watch on YouTube
మార్గము నీవని - గమ్యము నీవని - (2) నమ్మితి గనుక ఓ యేసు నాథా సుగమమాయెనే జీవ యాత్ర ప్రాణము నీవని - దేహము నీదని - (2) నమ్మితి గనుక ఓ యేసు నాథా చైతన్యమొందెనే జీవ యాత్ర బాధల బరువులో - నిత్య నిరాశలో శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2) శాంతము నీవని - స్వస్థత నీవని (2) నమ్మితి గనుక ఓ యేసు నాథా ఆనందమాయెనే జీవ యాత్ర ||మార్గము|| ప్రార్థన వేళలో - ఆద్రత మీరగా గొంతు మూగదై - భక్తి కన్నుల జాలగా (2) ధాత్రము నీవని - స్తోత్రము నీవని (2) నమ్మితి గనుక ఓ యేసు నాథా సంగీతమాయెనే జీవ యాత్ర ||మార్గము||