Thanksgiving

మానను మానను

Maananu Maananu

Watch on YouTube
యేసు నిన్ను నే స్తుతియించుట మానను మానను మానను కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడూ మాననే మానను ప్రతికూల పరిస్థితులు వెంటాడు ఘడియలలో నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలచి ||యేసు నిన్ను|| సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి వరముగా నిత్యజీవము నిచ్చితివి నాకింక నిన్ను స్తుతియించకుండా ఉండు కారణమేది లేకపోయెను ||యేసు నిన్ను|| పరమందు ధనవంతుడు నేనగుటకు దారిద్యములో నీవు జీవించితివి ఈ లోక ధనము నను విడచిపోయి దరిద్రునిగా నే మిగిలినను ||యేసు నిన్ను|| నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి నా పాప రోగము కడిగితివి ఈనాడు నీవు నా దేహరోగము స్వస్థపరచినా లేకున్నా ||యేసు నిన్ను|| అసాధ్యుడవు నీవు సర్వాధికారివి సార్వభౌముడవు దయాలుడవు నా జీవితములో నా మేలుకోరకే సమస్తమును జరిగించు వాడవు ||యేసు నిన్ను||