Good Friday

మానవుడవై సకల నరుల

Maanavudavai Sakala Narula

Watch on YouTube
మానవుడవై సకల నరుల మానక నా దోషముల బాపుటకు బలియైతివే యేసు - (2) బహు ప్రేమ తోడ ||మానవుడవై|| నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు - (2) నియమంబు నిచ్చి ||మానవుడవై|| నీ శరీరము రొట్టె వలెనె నిజముగా విరువంగబడెనే నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే - (2) నా యన్న యేసు ||మానవుడవై|| మంచి యూట మించి దండి పంచ గాయములలో నుండి నిత్య జీవపు టూటలు జేసితి - (2) నీ ప్రేమ నుండి ||మానవుడవై|| నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుడంటివి నీ - (2) నిజ భక్తి తోడ ||మానవుడవై|| ఎంతో ప్రేమతో బలిగానయితివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప - (2) శ్రీ యేసు దేవా ||మానవుడవై|| నిత్య బలియగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ - (2) నిజ రూప మొంద ||మానవుడవై|| నేను నీ బలిలోన గలిసి నేను నీతో గలిసి మెలిసి నేను నీవలె నుండి జేసితివే - (2) నా దివ్య యేసు ||మానవుడవై|| నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాప భారములు దిగునే - (2) నా దివ్య యేసు ||మానవుడవై|| నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే - (2) నిజ దేవా యేసు ||మానవుడవై|| నీవే నీ చేతులలో నిత్తువు ఈ నీ బలి విందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసు - (2) ఎన్నడును మరువను ||మానవుడవై||