Praise
లెక్కింపగ తరమా నీ మేలులు వివరింపగ తరమా నీ కార్యములు
Lekkimpaga Taramaa Nee Melulu Vivarimpaga Taramaa Nee Kaaryamulu
లెక్కింపగ తరమా నీ మేలులు
వివరింపగ తరమా నీ కార్యములు (2)
నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము
నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2)
||లెక్కింపగ||
నీ ప్రేమలోనే తను ఎదగాలి
నీ రక్షణలోనే కొనసాగాలి (2)
నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని
నిరతం నిన్నే స్తుతియించాలి
తన జీవితమంతా నీ రెక్కల క్రింద
నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2)
||లెక్కింపగ||
నీ వాక్యము తన హృదిలో ఉండాలి
నీ తలంపులు మదిలో నిండాలి (2)
నీ దయయందు మనుష్యుల దయయందు
ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి
నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో
ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2)
||లెక్కింపగ||
