Praise

లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

Lekkinchaleni Sthothramul Devaa Ellappudu Ne Paadedan

Watch on YouTube
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశమున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||