Faith
క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును
Kreesthulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu
క్రీస్తులో జీవించు నాకు - ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది - జయముంది నాకు (2)
ఎటువంటి శ్రమలొచ్చినా - నేను దిగులు పడను ఇలలో (2)
ఎవరేమి చెప్పిననూ - నేను సోలిపోనెప్పుడూ (2)
||జయముంది||
నా రాజు ముందున్నాడు - గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)
మట్టలను చేత పట్టి - నేను హోసన్నా పాడెదను (2)
||జయముంది||
సాతాను అధికారమున్ - నా రాజు తీసివేసెను (2)
సిలువలో దిగగొట్టి - యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)
||జయముంది||
