Worship
క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి
Kreesthe Sarvaadhikaari Kreesthe Mokshaadhikaari
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి
||క్రీస్తే||
ముక్తి విధాత నేత - శక్తి నొసంగు దాత
భక్తి విలాప శ్రోత - పరమంబు వీడె గాన
||క్రీస్తే||
దివ్య పథంబురోసి - దైవంబు తోడు బాసి
దాసుని రూపు దాల్చి - ధరణి కేతెంచె గాన
||క్రీస్తే||
శాశ్వత లోకవాసి - సత్యామృతంపు రాశి
శాప భారంబు మోసి - శ్రమల సహించె గాన
||క్రీస్తే||
సైతాను జనము గూల్పన్ - పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప - రుధిరంబు గార్చె గాన
||క్రీస్తే||
మృత్యువు ముళ్ళు తృపన్ - నిత్య జీవంబు బెంపన్
మర్త్యాళి భయము దీర్పన్ - మరణంబు గెలిచె గాన
||క్రీస్తే||
పరమందు దివిజులైన - ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు - ప్రభునే భజించు గాన
||క్రీస్తే||
ఈ నామమునకు మించు - నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ - హెచ్చించినాడు గాన
||క్రీస్తే||
