కరుణ చూపించుమా - యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా - యేసయ్య స్వస్థతలు చూపగా (2)
నీ ప్రజలము అయిన మేము - మృత్యువు కోరలో చిక్కాము
ఏ దారియు కానరాక - నశియించి పోతున్నాము (2)
కరుణగల దేవుడు నీవు
కరుణించి కాపాడుమా (2)
||కరుణ||
ఐగుప్తులో పది తెగుల్లలో - నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి - మృత్యువాత తప్పించితివి (2)
నీ నామము మదిలో నిలిపి - ఈ ఆపదలో వేడాము
నీ మహిమను తిరిగి చూడగా - నీ సన్నిధిలో చేరాము (2)
||కరుణగల||
ఇశ్రాయేలు వారిగ మేము - నీ ఉనికిని ప్రశ్నించాము
నీ ప్రేమను రుచి చూసిననూ - మారాను కురిపించాము (2)
చెలరేగే సర్పము కాటు - మములను కబళించే వేళ
మాకు దిక్కు నీవేనంటూ - మోకరించి నిను వేడితిమి (2)
||కరుణగల||
మరణమునే జయించి నీవు - సజీవుడిగా నిలిచావు
నిన్ను నమ్మి వేడిన చాలు - మా తప్పులు మరిచావు (2)
నేను జీవించితి గనుక - మీరును జీవించెదరన్న
వాగ్దానము నమ్మితిమయ్యా - నెరవేర్చుము మా యేసయ్య (2)
||కరుణగల||
