కరుణ గల యేసయ్యా
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2)
నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా (2)
||కరుణ గల||
నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త.. ఆలోచన కర్త
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా..!
||నీ ప్రేమే చూపకపోతే||
నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను (2)
విడువని విమోచకుడా.. విడువని విమోచకుడా
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా..!
||నీ ప్రేమే చూపకపోతే||
నా జీవితమంతా - జీవించెద నీకొరకే
నాకు ఉన్న సమస్తము - అర్పించెద నీ సేవలో (2)
పిలచిన నిజ దేవుడా.. పిలచిన నిజ దేవుడా
నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా (2)
నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా..!
||నీ ప్రేమే చూపకపోతే||
