Prayer

కరుణ చూపించుమా యేసయ్య

Karuna Choopinchumaa Yesayya

Watch on YouTube
కరుణ చూపించుమా - యేసయ్య కన్నీరు తుడవగా మహిమ కురిపించుమా - యేసయ్య స్వస్థతలు చూపగా (2) నీ ప్రజలము అయిన మేము - మృత్యువు కోరలో చిక్కాము ఏ దారియు కానరాక - నశియించి పోతున్నాము (2) కరుణగల దేవుడు నీవు కరుణించి కాపాడుమా (2) ||కరుణ|| ఐగుప్తులో పది తెగుల్లలో - నీ ప్రజలను కాపాడితివి గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి - మృత్యువాత తప్పించితివి (2) నీ నామము మదిలో నిలిపి - ఈ ఆపదలో వేడాము నీ మహిమను తిరిగి చూడగా - నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల|| ఇశ్రాయేలు వారిగ మేము - నీ ఉనికిని ప్రశ్నించాము నీ ప్రేమను రుచి చూసిననూ - మారాను కురిపించాము (2) చెలరేగే సర్పము కాటు - మములను కబళించే వేళ మాకు దిక్కు నీవేనంటూ - మోకరించి నిను వేడితిమి (2) ||కరుణగల|| మరణమునే జయించి నీవు - సజీవుడిగా నిలిచావు నిన్ను నమ్మి వేడిన చాలు - మా తప్పులు మరిచావు (2) నేను జీవించితి గనుక - మీరును జీవించెదరన్న వాగ్దానము నమ్మితిమయ్యా - నెరవేర్చుము మా యేసయ్య (2) ||కరుణగల||