కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)
విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)
విడువడు నిన్ను
రాతిరంత ఏడుపొచ్చినా - కంట నీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా - వెలుగు నీకు కలగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా - పేరు పెట్టి నిన్ను పిలచినా
నీ చేయి పట్టి విడచునా - అనాథగా నిన్ను చేయునా
||విడువడు||
అంధకారమడ్డు వచ్చినా - సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించినా - క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
బాధ కలుగు దేశమందునా - బంధకాలు ఊడకుండునా
శత్రువెంతో పగతో రగిలినా - గిన్నె నిండి పొర్లకుండునా
||విడువడు||
