కన్నుల నిండుగ - క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ - ఆనందముండుగ (2)
పరమ పురినుండే - పరిశుద్ధ దేవుడు
పుడమిలో పుట్టెగా - పాపుల బ్రోవగ
మహిమలోనుండే - మహిమాత్ముండు
మనుజుడాయెగా - మరణము నొందగా
రండి చేరి కొలిచెదం - రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం - పదండి ప్రభుని చూపించుదాం (2)
సర్వసృష్టిని మాటతో చేసిన - సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా
లోకపాపమంతయూ మోయవచ్చిన - దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2)
చీకటినుండి వెలుగునకు - మరణమునుండి జీవముకు (2)
నడిపింప వచ్చిన నజరేయుని - దాటింప వచ్చిన దయామయుని
ప్రేమించి వచ్చిన ప్రేమామయుని - క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని
||రండి||
విశ్వమంతయూ వ్యాపించియున్న - సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా
అంతరంగమంతయూ ఎరిగియున్న - సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా (2)
దాస్యము నుండి స్వాతంత్ర్యమును - శాపము నుండి విడుదలను (2)
ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని - రక్షింప వచ్చిన రక్షకుని
శాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని - విడిపింప వచ్చిన విమోచకుని
||రండి||
ఊహకందని త్రియేకమైయున్న - అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా
నిన్న నేడు రేపు ఏకరీతిగున్న - నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా (2)
సంకెళ్ళనుండి సంబరానికి - ఉగ్రతనుండి ఉదాత్తతకు (2)
తప్పింప వచ్చిన త్యాగమూర్తిని - కనికరింప వచ్చిన కరుణశీలుని
కృపజూపవచ్చిన కృపాకరుని - దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని
||రండి||
