కలుగును గాక - దేవునికి మహిమ - కలుగును గాక
కలుగు నున్నతమైన - ఘన స్థలములందున
నిలకు సమాధానం - నరుల కాయన దయ
||కలుగును||
ప్రభువైన దేవా - పరమరాజా - సర్వపరిపాలా
పరిపూర్ణ శక్తిగల- పరమ జనక నిన్ను
మహిమ స్తుతించుచు - మరి పొగడుచున్నాము
||కలుగును||
మహిమపర్చుచు - ఆరాధించు - చున్నాము నిన్ను
మహిమాతిశయమును - మది దలంచియు నీకు
మహిని మా స్తుతి కృత - జ్ఞత నిచ్చు చున్నాము
||కలుగును||
ఏక కుమారా - యేసు ప్రభువా - యెహోవా తనయా
లోక పాపము మోయు - ఏక దేవుని గొఱ్రె
పిల్ల మమ్మును కనిన - రించుము చల్లగ
||కలుగును||
పరిశుద్ధుడవు - ప్రభుడవు నీవో - ప్రభువైన క్రీస్తూ
పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవునియందు
బరిపూర్ణ మహిమతో - బ్రబలుచున్నామామేన్
||కలుగును||
